ఆంగ్లమాదిగ వచ్చె పాట కూర్చుటకైన
తెలుగు పలుకు కొంచెమైన రాదు
పుట్టుకాంధ్రమైన, బ్రదుకు ఆంధ్రమైన
వట్టి వెట్టి చేయు భాష నాదు
నన్నయాదిగ రాసె భారతాఖ్యానంబు
పత్రమైన లేదు నన్ను దయకటాక్షంబు
పిందె వగరుకైన కలము కదులకుండె
తెనుగు మధుర రసము నాలో నిండునెపుడో
యతి ప్రాసలు లేని పిచ్చి పాటనైనా
పట్టుదల తో నేను మొదలు పెడితి
భావములను గ్రోలు కవుల చెవులనైనా
అపశృతుల వలన దగ్గరైతి
తేట తెలుగు పాట ఆనంద లాహిరై
అరగి పోవు అమ్మ పాయసములా
మధుర రుచికి నేను వేచి కూర్చుని ఉండే
కలుగజేయు నాకు కవిత భుక్తి
చేరె నన్ను కవిత తెలుగు వనిత వోలె
దూరముండి కొంటె చూపులొలికి
దరికి రాదు తాను కను మరుగునూ కాదు
మురిపెములతో ముద్దు గుమ్మ లాగ
No comments:
Post a Comment