Monday, November 11, 2019

పలుకు

కలల లోని కవిత పాల కడలి వల్లె
పొంగుతున్న, ఉరికి పోరలుతున్న
మాట పలక లేదు పెదవి కదల లేదు
వింత భయము నన్ను కమ్మెనన్న

కనుల ముందు పెద్ద కోట బురుజు మల్లె
వింత అడ్డమొకటి ముందు నిలిచె
అధిగమించ వలేను అన్న కోరిక నన్ను
అతిశయించగ నాకు బుద్ధి కదిలే

మంచి చెడుల పట్ల మనసు పెట్టనీక
కష్టమోర్చి , హితుల కేళి నోర్చి
అడ్డం ఎదురుకున్న తెలిసి వచ్చే నాకు
అద్దం మల్లె నాలో ఉన్న వెలితి

హితులు కాదు నాకు సృష్టి కాదు 
నాకు నేనె అయితి పెద్ద అడ్డు
నన్ను దాటినంత పలుకులన్ని దొరలె
కవిత శిల్పమిదియె బయలు వెడలే

No comments: