ఆత్మజు మరచిన పనులకు కొండొక కోపము తోడను కఠినము బూని
సల సల మరిగెడు రక్తము శిరమున నృత్యము సేయగ సత్యము విడచి
గరళము గ్రక్కుతు ప్రేలెను చిరు హృదయము గాయపడగ భీషణముగా
నేర్పితినెన్నోమారులు నయము కూడి మధురముగా సహనము తోడన్
మందమతివి విననేరవు, నాకైనా గుర్తు సేయవైతివి నీవు
ఆత్మను స్పృసియించి నేను ఆలోచింపగ తోచె అవలోకమున
మరచిన పుత్రునికన్నను నాపై కలిగెను కోపము అంతర్గతముగా
తప్పులు దొరలవు నాచే అన్న అహము బింబమువలె గన్పడె నాకుఁ
మరపు వరము మనుషులకును అన్న పలుకు నే మరచితి అతిక్రూరముగా
మెండు వయసు వలన, బల దర్పముల వలన చిన్న వాని జేసి అదిమి కసిరె
మెండు వయసు వలన, బల దర్పముల వలన చిన్న వాని జేసి అదిమి కసిరె
పసిపాపని కన్నులలో దైన్యమును, దైవమును జూచిన శిల మదియు కరిగె